Latest Video :

మా లోకం

మా లోకం

గర్జన,సింహ నాదం, విజయ భేరి.దండోరా..ప్రజా అంకిత యాత్ర..సమర సింహం, శంఖా రావం, మహానాడు..పేర్లు వేరైనా.పని ఒక్కటే జనాన్ని పోగెయ్యడం, మన నాయకుణ్ణి పొగిడెయ్యడం...పక్క పార్టీ వాణ్ణి తిట్టెయ్యడం..పెద్ద వాళ్ళకి పంపు కొట్టెయ్యడం..వాగ్దానాలు జనం మీదకి నెట్టెయ్యడం..

పాపం జనం మళ్లీ ఎలక్షన్ వచ్చింది..ఈ సారి మనకు బోల్డంత మేలు జరుగుతుంది అని క్యూలు కట్టి మరీ ఓటెయ్యడానికి లైను కట్టెయ్యడం మామూలే..

ఆ మధ్య తిరుపతి లో చిరంజీవి పార్టీ ఎనౌన్స్ మెంట్ కి వచ్చిన జనం చూసి అహో తిరుపతిలో చిరు పరపతి బాగుందే అనుకున్నారు.తరువాత..గుంటూరులో చంద్రబాబు పెట్టిన సభకీ జనం అలానే వచ్చారు.ఇక రోడ్ షోలలో జనాల సంగతి సరే సరి..వీళ్ళంతా (సినీ)నాయకులని చూడ్డానికి వస్తున్నారా...లేక నిజంగానే వాళ్ళేమి చెబుతారో విని నిర్ణయించుకోవడనికి వస్తున్నారా..అన్నది నేతి బీరకాయలో నెయ్యి వెతకడం లాంటిదే...

సభ కి వచ్చే జనం హైదరాబాద్ బిర్యానీ కోసమో లేక హైదరాబాద్ చూడడం కోసమో వచ్చారో లేక మందు పాకెట్ కోసమో.ఆ తోలుకొచ్చిన సారీ తీసుకొచ్చిన నాయకులకే తెలియాలి...

రోజుకో పేరుతో రోజుకో పార్టీ పెట్టే సభల్లో వాళ్ళిచ్చే హామీలు చూస్తుంటే నిజంగా అవన్నీ సాధ్యమేనా అని అనిపిస్తుంది..ఆంధ్రా ని అమ్మితే కూడా కష్టమేనేమో..
నిన్నటిదాకా సమైక్యాంధ్ర అన్న బాబు..ఇవాళ టీ ఆర్ ఎస్ తో కలిశాడు..మరి ఇస్తారనా ఇవ్వరనా..వాళ్ళిచ్చే కలర్ టీ వీల్లో చూడాలేమో.

ఇక రాజీవ్సేఖర్ రెడ్డి గారైతే సోనియా మాత దయవల్ల అన్ని సీట్లూ మేమే గెలుస్తాం..ఏ పార్టీ వాళ్ళొచ్చినా రోడ్ షోలలో జనం మా పార్టీ గుర్తు చెయ్యినే చూపిస్తున్నారు..ఊపుతున్నారు..అని పంచె సవరించుకుంటున్నారు..ఆయన చాలా ట్రాన్స్పరెంట్..

చిరుగాలిలా వచ్చి సుడిగాలి పర్యటన చేసి..గొడుగు కోసం ఎదురుచూస్తున్న మెగా నాయకుడు కూడా వందే మీ తరం అంటున్నారు..సిలిండరైనా సరే..పప్పు ఉప్పూ అయినా సరే వంద రూపాయలకే ఇంద్ర లోకం చూపిస్తానంటున్నరు

ప్రజలు ఏ లోకం ఇష్ట పడతారో చంద్ర లోకమో..ఇంద్ర లోకమో.ఇందిరా లోకం...వేచి చూడాల్సిందే..

Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger