Latest Video :

జీరోయిన్లు ...

జీరోయిన్లు ...
ఏంటో..అందంగా...కంటికి ఇంపుగా..చక్కని మేకప్పులో బ్లాక్ అండ్ వైట్ అయినా..ఎంతో హాయిగా...చూడముచ్చటైన దుస్తులతో ఉండే హీరోయిన్లని చూసి ఎన్నాళ్లయిందో..
అదేంటో సినిమా హాళ్ళలో ఆడకో యేమిటో గానీ ఈమధ్య కొత్త సినిమాలు తెగ వచ్చేస్తున్నాయి టీ వీల్లో..అందులో ఒక్క సినిమాలోనూ మన తెలుగు హీరోయిన్లు కనిపించరు..
చూడముచ్చటగా ఉండే ఆ రోజుల్లో హీరోయిన్లలో సావిత్రి, దేవిక, రాజసులోచన లాంటి వాళ్ళు అందంగా ఉండడమే కాక అభినయం కూడా ఎంతోబాగుండేది అందుకే కధలో కూడా వాళ్ళకి మంచి ఇంపార్టెన్సు ఉండేది..ఇప్పుడు కధానాయకలకి భాష రాదు..వాంపు లాంటి డ్రస్సులు వేసుకుని రాంపుల మీద పిల్లి నడకలు నడవడం తప్ప ఇంపుగా నాలుగు ముక్కలు మాట్లాడడం రాదు కాబట్టి..ఏదో గుడ్డ పీలికలు తగిలించి..పళ్ళు బిగబట్టి చిన్న చిన్న సీన్లు తీసేసి...ఆపైన వళ్ళంతా వూగిపోయే పాటలు ఆటలు తో సరిపెట్టేస్తున్నారు..ఇక మిగిలిన టైము అంటే హీరోయిన్ గారు చెయ్యాల్సిన టైముని అటు హీరో గారి లాగుడు డైలాగులకో...లేకపోతే..హీరోయిన్ చుట్టూ వుండే ఆమె వదినల బ్రుందానికో..హీరో చుట్టు వుండే కమెడియన్ మూక కో పెట్టి మన ప్రాణాలు తీస్తారు..ఇదీ కాక పోతే ఏ సూమోల చేసింగ్ సీన్లతో నో మన బుర్ర రామకీర్తన పాడిస్తారు...
అంతే తప్ప హీరోయిన్ కి తెలుగు నేర్పించరు..తెలుగు హీరోయిన్లని తీసుకోరు..ఎందుకంటే స్టార్టింగ్లోనే మనవాళ్ళు బరి తెగించరు కాబట్టి..
ఇంక ఈ మధ్య ఫాషన్ విషయానికి వస్తే హీరోలు..సిక్ష్ పేక్ అని కండలు పెంచేస్తున్నట్ట్లు..హీరోయిన్లు అదేదో జీరో సైజుట అలా తయారు అవుతున్నారు..అసలే సినిమాలో పాత్ర అంతంత మాత్రం కనపడుతుంది..హీరొ..ఆయన కామెడీ మిత్రులు..హీరోయిన్ చుట్టు వుండే బంధు మిత్రులు మధ్యలో హీరోయిన్ ని వెతుక్కోవడం కష్టం ఇంక ఈ జీరో సైజుకూడా ఐతే ఇంక తెలుగు సినిమాలో ఆమె పాత్ర జీరోయినే....
నాన్నా అతిగా కండలు పెంచిన హీరో అతిగా సన్నబడిన హీరోయిన్ సినిమాలు ఆడినట్ట్లు చరిత్రలో లేదు..హ హా హా అదుర్స్ కదూ...
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger