తెలుగు సినిమా చూడడం ఆహా(ని)కరం
ఈ మధ్య కొన్ని సినిమాల్లో టీవీ ప్రకటనల్లో చూసా సిగరెట్ సీన్లు మందు సీన్లు వస్తే ధూమపానం హానికరం, మధ్య పానం హానికరం అని సీన్ కింద ప్రకటనలు కనిపించాయి..ఆహా సమాజం పట్ల ఎంత బాధ్యత..? అనుకున్నా...అది గవర్నమెంట్ పెట్టిన రూలో మరోటో నాకు తెలీదు కానీ..బాగుంది అనిపించింది..కానీ ఇంతలో అదే సినిమాలో హీరోయిన్ అతి కొద్ది బట్టలేసుకుని వంగుని..కూర్చుని ...పడుకుని..దొర్లి నానా హైరాన పడే పాట ఒకటి వచ్చింది..అదేదో శ్రుంగార నాయక కాదు..ఐటం సాంగు అంతకన్నా కాదు..హీరయినే...ఆపని చేసింది..
కాసేపట్లో విలన్ మహాశేయుడు...ఒక అమ్మాయిని కారులోకి లాక్కుని...నోరు నొక్కి...వళ్ళంతా తడిమి..బట్టలు చించి రేప్ చేశాడు....మరికాసేపట్లో ఒక వర్షం పాట..అందులో నిండా చీర కట్టుకున్నా వళ్ళంతా కనపడేలా మరో సారి హీరోయిన్ విజ్రుంభణ....కాసేపయ్యాక విలన్ గాంగ్ జనాల మీద పడి కొట్టటం, కాల్పులు,, బాంబులు వగైరా విధ్వన్సాలు..వాళ్ళని చంపడానికి హీరో చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని..హతమార్చి..ఆ కేసు కొట్టేయడం...చివర్లో హీరో గారిని చేసుకోవడానికి ఇద్దరు హీరోయిన్లు పోటీ పడడం అక్కడ తాతగారిగా ఉన్న సీనీర్ ఆర్టిస్ట్ గారు..చెవిలో ఏదో చెప్పగానే సదరు ఇద్దరు హీరోయిన్ల పై చెయ్యి వేసి మన హీరో గారు ఫోసు ఇవ్వడం శుభం కార్డు......
ఇంతకీ నా డౌట్ ఏంటంటే సినిమాలో సిగరెట్/మందు తాగుతున్నట్లు కనిపిస్తే తప్పుగా కినిపించినప్పుడు (రోడ్డు మీద ఎంతో మంది సిగరెట్ / మందు తాగిన వాళ్ళని చూస్తాం కానీ, రేపులు, మర్డర్లు చేసేవాళ్ళని చూడం) హత్యలు, మానభంగాలు, ఎక్ష్పోసింగులు, శ్రుంగార సన్నివేసాలు కీడు చెయ్యవా అని...అవన్నీ లేకుండా వూరికే సందేశాలిస్తే చూస్తారా అని కొంతమంది అడగొచ్చు..సినిమా అన్నది ఒక బలమైన మాధ్యమం దాని ద్వారా వినోదం. విఙానం అందించాలి గాని చౌకబారు విషయాలు కాదు..ఇదివరకు సినిమాల్లో మాన భంగం సీనుకి లేడిని వేటాడుతున్న పులి,, ముద్దు సన్నివేసాలకి చెట్లు వూపడం., ఇక శ్రుంగార విషాయలకు ప్రక్రుతినో ..చిన్న పిల్లల ఫొటోలనో సింబాలిక్ గా చూపించేవాళ్ళు..ఇప్పుడు ఇంకా క్రియేటివ్ గా మరేవైనా చూపించొచ్చు...కధలో బలం వుండి..నటన అర్ధవంతం గా వుండి..హాస్యం కూడా తోడైతే...అద్భుతమైన హిట్ అందిస్తారు ప్రేక్షకులు...ఆహా కరం కి హానికరం కి తేడా తెలుసుకుని. (సామాజిక బాధ్యత గుర్తెరి) మనవాళ్ళు సినిమాలు తీస్తే భావి తరాలకి మంచిది..
కేసు విషయం లో నిజానిజాలు తెలీకపోయినా ఇటీవల జరిగిన సంచలన కేసులో ఒక ముద్దాయి చెప్పినట్టు టీవీల్లో వచ్చే క్రైం ప్రోగ్రాములు చూసి చూసి నాకూ అలా చెయ్యాలనిపించి మర్డర్ చేసి రేప్ చేసా అన్నాడు..ఇది నిజంగా అలోచించాల్సిన విషయం...సిగ్గుపడాల్సిన దారుణం..
మన తరువాత తరం ..టీనేజి వయసుకి కూడా రాకుండానే పాడవకుండా వుండాలంటే సినిమాల్లోనూ రూల్స్ అవసరం....ఎక్కడా కధ డిమాండు చెయ్యదు బికినీలని. ముద్దు సీన్లని..(కధకి నోరులేదు) పైకం ఈకువ తీసుకున్న మైకంలో ముంబాయి మూదు గుమ్మల పైత్యం తప్ప...జనాల వీక్నెస్స్ ని సొమ్ము చేసుకోవడానికి దర్శక నిర్మాతల స్వార్ధం తప్ప..