అమ్మ
భగవంతుడు అన్ని చోట్లా ఉండలేడు కాబట్టి అమ్మని శ్రుష్టించాడంటారు పెద్దలు..నిజమే.ఆమె చేసే పనులు ఆ దేవుడు కూడా చెయ్యలేడేమో..పుట్టించేసి చేతులు దులిపేసుకుంటాడు డేవుడు..అందుకేనేమో భర్త ని కూడా దేవుడు తో పోలుస్తారు పెద్దలు..తొమ్మిది నెలలు గర్భం లో జాగ్రత్తగా పెంచి..ఉమ్మ నీరు పరుపులా గుండె చప్పుడు లాలిపాటకు చిచ్చిగా..నిద్ర పుచ్చినట్టుగా కాలం గడిపి...లోపల తంతున్నా...అందులోనూ ఆనందం వెతుక్కుని...ఎన్నో శ్రమలొకోర్చి....నొప్పులు పడి..ఆపరేషన్ పేరుతో కోత కోసినా మనల్ని కని..భూమిపైన కాక తన పై వేసుకుని పెంచే 'స్థన్య ' జీవి 'అమ్మ '....'అమ్మతనం ' లోని కమ్మతనం మనకు పంచుతూ..శ్రమలకోర్చి పెంచుతూ..తను తిన్నా తినక పోయినా..నిద్ర పోయినా లేచి వున్నా పాలకి ఏడ్చినప్పుడల్లా పాలిచ్చి..అన్నం తినిపించి..ఉచ్చ--పియ్య అన్ని శుభ్రం చేసి..మంచి చెడు అన్ని చూసి..అనారొగ్యం వస్తే తాను తిండి మానేసి..కంటి కునుకు వదిలేసి..క్షణ క్షణం కళ్ళల్లో వత్తులేసుకుని..మనల్ని కాపాడే దేవత అమ్మ..చిన్న చిన్న విషయాలకు కూడా పొంగిపోతూ మనగురించి నిత్యం ఆలోచించి..ప్రతి క్షణం మన ప్రగతి గూర్చి అలోచిస్తూ..అ ఆ లు నేర్పే తొలి గురువు అమ్మ..విద్య..వైద్యం..మార్గదర్శకత్వం అందిచే అమ్మ ఆల్ రౌండర్...మనకి ఇప్పుడు తెలిసినవన్నీ అమ్మకు ఎప్పుడో తెలిసినా..కొత్తగా విన్నట్టు నటిస్తూ మనల్ని గొప్పోళ్ళని చేసే అమాయకురాలు అమ్మ..
చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తుంటే దగ్గరుండి ప్రోత్సహించి..తప్పొప్పులు చెప్పి..నన్ను సరైన దిశ లో నడిపించి..ఒక కళాకారుడిగా తీర్చిదిద్దింది మా అమ్మ..నేను ఏది రాసినా మొదట చూసి/విని సరి చేసే ఎడిటర్ మా అమ్మ..అలా నన్ను అన్ని విధాలుగా ప్రభావితం చేసిన మా 'అమ్మ ' సడెంగా నన్ను వంటరిని చేసి, తనకి నేను సేవ చేయాల్సిన సమయం వచ్చేసరికి ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది...అవును దేవుదికి కూడా అమ్మ అవసరమైందనుకుంటా...అవును తల్లి లేని వాడు కదా..ముచ్చటపడి తీసుకెళ్ళిపోయాడు....కనీసం తనైనా పూర్తిగా సేవ చేస్తాడేమో.....
ప్రపంచంలో ఎవరినైనా 'అమ్మా అనొచ్చు..అందరిలోనూ అమ్మ తనం వుంది..నాన్న అని అందరినీ అనలేం..అమ్మతనం అంత గొప్పది..మమ్మీ సంస్క్రుతిలో ఆ విలువలూ తెలియవు..ఆ బంధం ఏర్పడదు..ఎందుకంటే మమ్మీ లలో "లైఫ్" ఉండదు..శవ పేటికలని మమ్మీలంటారట కొన్ని ప్రాంతాలలో...మన అమ్మ ప్రాణ రూపంలో ఉన్న దేవత....అమ్మ కి మొక్కితే ఆ దేవుడికి మొక్కినట్టే...
దసరా పర్వదినాలలో కనకదుర్గలో ఐక్యం అయిపోయిన అమ్మ (మా అమ్మ పేరు కనకదుర్గ )కి అంకితం....