సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు...
సర్వధారి ఐనా మన నేతలని సరైన దారిలో నడిపించాలని..కోరుతూ...మీ ఫణి మాధవ్..
కాంగ్రెస్ రాశి వారు...
ఆదాయం వేల కోట్లు...వ్యయం వందలు
రాజ పూజ్యం ఫుల్లు అవమానం నిల్లు
హామీలు బోలెడు అమలు చిప్పెడు
తెలుగుదేసం రాశి వారు
ఆదాయం పాతవే వ్యయం రాజ్యం వచ్చేవరకు
రాజ పూజ్యం గతం అవమానం వర్తమానం
ఆశలు అధికారం నిజం మిధ్య
తెలంగాణా రాష్ట్ర సమితి రాశి వారు
ఆదాయం సెంటిమెంటు వ్యయం అపయింట్మెంటు
రాజ పూజ్యం సోనియ దయ అవమానం జనం దయ
ఆశ ప్రత్యేక రాశ్త్రం నిజం కేంద్రం పెత్తనం
భారతీయ జనతా రాశి వారు
ఆదాయం ఖతం వ్యయం నిత్యం
రాజపూజ్యం గతం అవమానం పత్యం
ఆశ ప్రభుత్వ నిర్వహణ ఆశయం రామాలయ స్థాపన
కమ్యునిస్టు రాశి వారు
ఆదాయం ప్రజల పాట్లు వ్యయం ప్రజా ఆందోళణలు
రాజపూజ్యం కలకత్తా అవమానం కొత్త
ఆశ ప్రజా ప్రభుత్వం నిజం మద్దతులు పొత్తులు
ఏమిటో ముఖ్యం గా ఐదు రాశులు కనిపిస్తున్నాయి మిగతావి కొంచెం తరువాత
ఉగాది శుభాకాంక్షలతో