Latest Video :

విరోధి

విరోధి

అందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు..అసలు తెలుగు సంవత్సరాది ఏంటో ..వాటికి పేర్లేమిటో చాలా మందికి తెలీదని నాకు నిన్ననే తెలిసింది..ఉగాది రోజు కూడా హాపీ న్యూ యియర్ అంటూ పలకరించే వాళ్ళే కాని ఉగాది శుభాకాంక్షలు అని చెప్పిన వాళ్ళు కనపళ్ళా..కొంత మంది కైతే అది ఒక శలవు మాత్రమే...కొందరికి అదీ లేదు..బయట దేశాల్లో ఉన్న వాళ్ళకైతే..వాళ్ళకి శలవు దినమైన శుక్రవారమో..ఆదివారమో చేసుకుంటారు ఈ పండగని..కానీ ఇక్కడున్న వాళ్ళకి ఏం మాయరోగమో అర్ధం కాలేదు..
చక్కగా మావిడి ఆకులు కట్టీ, ఇల్లు అలికి ముగ్గులేసి, తలంట్లు పోసుకుని..కొత్తబట్టలు కట్టుకుని..ఉగాది పచ్చడి తిని,,పాయసం లాంటి ఇంట్లో చేసుకున్న వంటకాలు తిని హాయిగా బంధుమిత్రులతో సరదాగా గడిపే పండగ కాస్తా వింత గా మారిపోయింది..పక్క దేశాల్నించి దిగుమతిచేసుకున్న ప్రేమికుల 'దినాలు ' మాత్రం..క్రమం తప్పకుండా శలవొచ్చినా రాకపోయినా.శలవు పెట్టి మరీ గ్రీటింగులకీ, గులాబీ పువ్వులకీ, హోటళ్ళలో తిండీ తిప్పలకి...పబ్బులకీ, పార్కులకి..రిసార్టులకీ తగలేస్తారు...పెళ్ళి కాకుండానే 'చెడ ' తిరిగేసి..తమ ప్రేమ గొప్పదనాన్ని చాటుతారు..
అసలు మన పండగల ప్రాధాన్యాలు..పరమార్ధాలు..ఎవరికీ తెలియవు..అక్కర్లేదు కూడా..కొన్నాళ్ళకి ఏ అమెరికా వాళ్ళో ఇదే ఉగాది పచ్చడిని పేటెంటు చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి సీల్ చేసి యు ఎస్ పికెల్ అని పేరెడితే మాత్రం అదేదో అమృతం లా కొనుక్కుని మరీ రోజుకో డబ్బా లాగిస్తారు...తెగ పొగిదేస్తారు...
వాళ్ళేది చేసినా మనకి శిరోధార్యం..వాళ్ళ దేశాచారాల ప్రకారం..వాళ్ళ వాతావరణ పరిస్థితుల్ని బట్టి వాళ్ళేదో ఒక పని చేస్తే మనమూ వాతలు పెట్టేసుకుంటాం...చక్కగా వొంట్లో వేడిని లాగేసే..గోరింటాకు వదిలేసి..సింథటిక్ కలర్లు ఉన్న టాటూలు అతికించుకుంటున్నారు..పడక పోతే ఎలర్జీలు గ్యారంటీ..
తీపి, పులుపు, కారం, వగరు, చేదు..ఇలా ఆరు రుచులతో చలికాలం నుంచి ఎండాకాలానికి రుతువు మారే టైములో బాడీని దానికి తగ్గట్టుగా సమాయత్త పరిచే ఔషధం మన ఉగాది పచ్చడి..జీవితం అంటే కష్టం సుఖం అన్నీ ఉంటాయని తెలియజెప్పడానికే ఇలా తీపి చేదు అనే పరస్పర విరుద్ధమైన రుచులని సంవత్సరం మొదటి రోజున తినే ఆచారం మొదలెట్టారు..కానీ మనకవన్ని అనవసరం,...పొద్దున్నే పదింటికల్లా లేచి..పాచి మొహంతో టీ నో కాఫీనో తాగి.పేపర్ తీసుకుని బాత్రూం కి వెళ్ళి..స్నానం కూడా చెయ్యకుండానే టిఫిన్ తిని కాసేపు ఫోన్లు మాట్లాడి అలా అబయటకెళ్లి వేయించిన బియ్యం అదే ఫ్రైడ్ రైస్ లాంటిదేదో తిని. సాయంత్రం పిజ్జానో నా బొందో తినేసి..సినిమాకో షికార్ కో తిరిగేసి..పబ్బులో గెంతేసి..వీలైతే తాగేసి..ఇంటికి లేటు గా వచ్చి మళ్ళీ మర్నాడు నిద్ర లేటుగా లేచి..హడావిదిగా ఆఫీసుకి బయలుదేరి వెళ్లడం తప్ప..మనకి ఇంకేమీ అక్కర్లేదు...
అదే న్యూ యేర్ అంటే మాత్రం ఒక నెల ముందు నుంచే మన ప్రణాలిక రెడీ...అయిపోతుంది..
ఎంగిలి పండగలు ఎలానూ వదల్లేరు..అలాగని మన పండగలని పట్టించుకోకుండా ఉండక్కరలేదు..
అమ్మ లాంటి మన సంస్కృతి కి విరోధి కాకండి



పక్కవాడి పండగ ఎందుకు దండగ మన పండగలు నెలకొకటి ఉండగ..
ఉగాది శుభాకాంక్షలతో..


Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger