Latest Video :

ప్రేమైక(ం) జీవితం

ప్రేమైక() జీవితం

"suicide is a permenant solution for a temporary problem" అని ఎక్కడో చదివినట్టు గుర్తు....ఈ రోజుల్లో ప్రేమ జంటలని చూస్తుంటే మెంటలెక్కుతోంది...

ప్రేమించ లేదని గొడ్డళ్లతో నరికే వాళ్ళూ.,యాసిడ్ దాడులు చేసే వాళ్ళూ ఒక రకం సైకోలైతే..

చంపి తాము చచ్చిపోయే వాళ్ళూ అదే కోవలోకి వస్తారేమో..

ఇక కలిసి చచ్చిపోయే వాళ్లు చావడానికున్న ధైర్యం బతకడానికి లేని పిరికి వాళ్ళు..

వీళ్ళ ప్రేమ లో నిజమెంత..బలమెంత...భవిష్యత్తు పట్ల వీరికున్న అవగాహన ఎంత అన్నది అర్ధం కాని విషయం,...వాళ్ళకైనా మనకైనా...


పదో క్లాసుదాకా ఒక రకంగా ఆటలు..చదువు..ఇంట్లో వాళ్ళ అజమాయిషి..కొంచెం బిడియం,,లాంటి వాటిల్తో సరిపోతుంది..ఇక కాలేజి అనే రాజ్యం లోకి అడుగుపెట్టగానే అదేదో చాలా పెద్ద వాళ్లమైపోయామని,,చాలా విషయాలు తెలిసిపోయాయని..కొత్త పరిచయాలు..కొత్త ప్రాంతాలు ,, ఆ పరిచయస్తులు చెప్పే కల్లబొల్లి మాటలు..నిజంగా వాళ్ళు అవి సాధించారేమోనన్న భ్రమలో అలాంటివి కాపీ చెయ్యడాలూ..బైకులు 120 పైన నడిపాను అన్న సీనియర్ మాటలు విని నిజం అనుకుని తానూ నడిపి అవిటివాడైన కధ కళ్ళ ముందే జరిగింది..ఇక కొత్తగా పరిచయమైన అమ్మాయి తను ఫ్రెండు,,గర్ల్ ఫ్రెండు అంటే అర్ధం కూడా తెలీదు..ఆ అమ్మాయి హలో అంటే ఒక రకమైన ఫీలింగ్..అది ఫ్రెండ్స్ తో చెపితే వాళ్ళు అది ప్రేమే అని నిర్ధారణ చెయ్యడం..వీళ్ళు అది నిజమే అని నమ్మేయడం..ప్రేమ అంటే సినిమాల్లో లాగా..కలిసి తిరగడం..పాటలు పాడుకోవడం అనుకుంటారు..హీరో హీరోయిన్ కూడా సినిమా అంతా ప్రేమించుకుని చివరకు పెళ్ళి చేసుకుంటారు...కానీ పెళ్ళి తరువాత ఎంత భవిష్యత్తు ఉందో చూపించరు కాబట్టి వీళ్ళకీ అంతవరకే ఆదర్శం......

ఇంట్లో చెబితే ఒప్పుకోరు కాబట్టి సినిమాల్లోలా లేచి పోవడం లాంటివి చెయ్యడం...బతకలేక ఏదో ఒకటి చేసెయ్యడం,,,,తమ పరీక్ష ఫీసులు కట్టడానికి అమ్మా నాన్నల మీద ఆధార పడ్డ వాళ్ళు ..ఫ్యూతర్ గురించి ఆలోచన లేకుండా తీసుకునే తెలివితక్కువ, చిన్నతనపు నిర్ణయాలతో బంగారు భవిష్యత్తు కోల్పోతున్నారు...

తమ జీవితాలే కాకుండా తమని నమ్మిన వాళ్ళ జీవితాలూ, కన్న వారి జీవితాలు నాశనం చేస్తున్నారు..

యువతీ యువకుల్లారా...పదో క్లాసు పాసయ్యాక ఏ కాలేజీ లో జేరాలి..ఏ గ్రూపు తీసుకోవాలి అని ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు.పేరెంట్స్, ఫ్రెండ్స్, పెద్ద వాళ్ళు, తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేస్తారు..ఇంటర్ అయ్యాక ఇంజినీరింగు, డాక్టర్ కోర్సుల గురించి వాకబు చేస్తారు...కోచింగు తీసుకుంటారు..మంచి కోర్సేదో మంచి కాలేజి ఏదో తెలుసుకుని జాయిన్ అవుతారు..కోర్సు అయ్యాక మంచి కంపెనీ వెతికి ఇంటర్వ్యూ ఎటెండు అయ్యి మరీ జాయిన్ అవుతారు..ఏ క్షణాన్నైనా మారడానికి వీలుండే ఈ విషయాలకే ఇంత చేస్తే ...జీవితంలో ఒక సారి ఒకరితో మాత్రమే జరిగి జీవితమంతా సుఖ సంతోషాలివ్వాల్సిన భాగస్వామి విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ఒక్క సారి ఆలోచించండి...ప్రేమ -- పెళ్ళి దాకా వచ్చినా ఇగోప్రబ్లెం స్ తో ..ఇతర కారణాలవల్ల విడిపోయే పరిస్థితులు కూడా ఇలానే వస్తున్నాయి..మన అమ్మా నాన్న లకి మనకి మధ్య జెనెరేషన్ గ్యాప్ ఉండి ఉండొచ్చు కానీ మన పేరెంట్స్ ఎప్పుడూ మన మంచి గురుంచి మాత్రమే ఆలోచిస్తారు..మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వాళ్ళు విలన్లుగా కనిపించినా..కనిపెంచిన వాళ్ళు మన భవిష్యత్తుని..వాళ్ళ అనుభవ రీత్యా ఆలోచించి చెబుతారు..
ప్రాణం విలువైనది అది ప్రేమ కన్నా ప్రేమించిన వాళ్ళ కన్నా................
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger