Latest Video :

వేశ్యాగ్రుహాల పై దాడి మంత్రుల నిరాహార దీక్ష..

వేశ్యాగ్రుహాల పై దాడి మంత్రుల నిరాహార దీక్ష..
కంగారు పడకండి..మధ్యలో గీత ఉంది..రెండూ వేర్వేరు న్యూస్..చాలా కాలం క్రింద తనికెళ్ళ భరణి వ్రాసిన సినిమా డైలాగు ఇది..ఒక చిన్న కామా తో, గ్యాపుతో,,గీతతో అర్ధం మారిపోతుంది అని ఆయన భావం..అయితే ఈ మధ్య పత్రికలు చదివితే ఒకే న్యూస్ని ఒక్కొక్కరు ఒక్కోవిధంగా వ్రాస్తున్నారు..అది పత్రికలకి తగునా అని నా ప్రశ్న....
అసలే టీ వీ చానెల్స్ చూపించే సోది వల్ల కంఫ్యూసన్లో ఉన్న ప్రజలకి ..కాస్తో కూస్తో నమ్మదగిన సమాచారం ఇచ్చేవి పత్రికలే...ఈ మధ్య ఒకాయన చేపల శాఖలో ఉన్నా చేవగలవాడవడంతో కావాల్సిన శాఖలలో పనులు చేయించుకుంటూ కావాల్సినంత సంపాదించుకుంటూ..పంచుతూ..సాఖోపశాఖలుగా ఎదిగిన అవినీతి వ్రుక్షంగా పెరిగిన మీదట ఏ సీ బీ కి పట్టుబడ్డాడట...ఇది ఒక పత్రిక లో వచ్చిన విషయం...ఆ మనిషి (అలా అనొచ్చో లేదో..) ఎల్లో ఫిష్ అంటే తెలుగు దేశానికి చెందినవాడు అని అదే రోజు మరో పత్రిక లో మరో కధనం....డంబెల్తో మోది మొద్దు లాంటి హంతకుణ్ణి చంపిన ఒక రామ భక్తుడు..జైలులో ఉండగా చూడ్డనికి వచ్చిన వారిని ఫలానా పెద్దాయన బాగున్నాడా అని అడిగాడనీ...అంటే ఆ పార్టీకి అతనికి సంబంధం ఉన్నట్టేనని..ఇటీవలే ఉరిశిక్షనుంచి విడుదలైన ఒకాయన చాలా మంచివాడని మరో కధనం....
అసలు స్వతంత్ర్యం తెచ్చిన గాంధీ నెహ్రూలు కాంగ్రెస్ పార్టీ వారని...గాంధీని చంపిన గాడ్సే ఆర్ ఎస్ ఎస్ వాడని..ఇంకేదో రాముడు గిరించి మాట్లాడిన ఆయన మరో వర్గానికి చెందిన వాడని అతణ్ణి తూలనాలడం ఆ వర్గాన్ని కించపరచడమేనని..ఇలా ప్రతీ దానికీ సంబంధం ఉన్నా లేకున్నా ఏదో ఒకదానితో ముడిపెట్టి..వ్రాయడం..ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళ సామాజిక వర్గానికి మొత్తానికి జరిగినట్టు మిగతా వాళ్ళ వల్ల వాళ్ళకి ఏదో కీడు ఉన్నట్టు....కొన్ని పార్టీలు ..నాయకులే జనానికి మేలు చేసే వారు...మిగిలిన వారు దేశాన్ని అమ్ముకుతినే వారు అంటూ పక్షపాత ధోరణితో వ్రాయాల్సిన పని ఏంటో నాకు అర్ధం కాదు...
చిరంజీవి ఒక చోట ఎక్కువసేపు మాట్లాడారని..కేసు పెట్టి మరో చోట సీ ఎం అల్లుడు మాట్లాడినా కేసు పెట్టలేదని, తాము చేసిన ఫిర్యాదువల్ల కేవలం మైకు వాళ్ళని పట్టుకున్నారని...ఒక చోట వ్రాస్తే...చిరంజీవి రాజకీయాలు మాట్లాడారు..ఈయన ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడారు అని చెప్పడానికి ప్రభుత్వ ప్రతినిధుల వత్తిళ్ళు ఎదుర్కునే పోలీసు ఉద్యోగాలు కావు కదా పత్రికలవి..వాళ్ళు నిజం వ్రాస్తేనే జనం కి అసలు విషయాలు తెలిసేవి..
కాబట్టి అసలే టీవీలు, ఇంటర్నెట్టు తో కొట్టుకుపోతున్న పత్రికల భవిష్యట్టు వాళ్ళ నిజాయితీ..నిజమైన వార్తలందించే స్థయీలమీదే అధారపడి ఉందని భావిస్తూ...
నిజాన్ని అందించే జర్నలిజాన్ని కోరుతూ
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger