ఎందరో బ్లాగానుభావులు అందరకీ 'వంద' నములు...
తొంబైతొమ్మిదో రన్ దగ్గర బాట్స్ మెన్ లా నా వందవ పోస్టు దగ్గర నేనూ చాలా టైము తీసుకున్నా..అసలు నేనేనా 100 వ్రాసింది ? అని డౌటు కూడా వస్తోంది..అఫ్ కోర్స్ అందులో కొన్ని పండగ శుభాకాంక్షల్లాంటి ఎక్స్ ట్రా రన్నులు కూడా ఉన్నా అవీ ఈ ఖాతాలోకి చేరి వంద పూర్తి అయ్యాయి..
నా బ్లాగోగులు చూస్తున్న వారందరికీ పేర్లు తెలీక పోయినా క్రుతగ్న్యతలు.. బాగున్నాయంటూ ప్రోత్సహించిన వారికి, ప్రతిస్పందించక పోయినా చూసినవ్వుకున్న వారికీ, నచ్చక పోయినా చెప్పని వారికి, ఎందరో బ్లాగానుభావులు అందరకీ వందనములు...
అసలు బ్లాగంటే తెలీదు, కనీసం ఈమైలు కూడా తెరవడం కాదుకదా...క్రియేట్ చేసుకోవడం కూడా రాని నేను..బ్లాగడం అంటే ఈనాడు చలవే,,నాలో ఏవో కదిలే కొన్ని విషయాలు..ఎవరికి పంపినా ప్రచురుణ కావట్లేదు..ఎలా అనుకుంటుంటే ఈనాడులో బ్లాగుల గురించి చదివా...మా ఆఫీసులో ఒకాయన ఆయనా ఫణే..ఆయన బ్లాగులు..విధములు, విధి విధానాలు., ఖాత తెరుచుట, కథలు వ్రాయుట, మొదలైన విషయాల గురించి బ్లాగ్న్యానోదయం కావించారు..
అలా మొదలైన నా ఫన్ కౌంటరు.లో ఎన్నో విషయాలు చర్చించాను....నచ్చితే నలుగురికి చెప్పమన్నాను, నచ్చకపోతే నాకు చెప్పమన్నా..కూడలి, తేనెగూడు, జల్లెడ లాంటి వారు దత్తత తీసుకుని మాలాంటి పిల్లబ్లాగుల్ని పోషిస్తున్నందుకు, పిత్రువాత్సల్యం చూపిస్తున్నందుకు, వారికి, పుట్టుకనిచ్చినందుకు..గూగుల్ తల్లికి, చదివరులకు, బ్లాగుమిత్రులకు, అందరికీ ధన్యవాదాలు....మీ ఆశీర్వాదం ఉంటే ధన్యుణ్ణి....
ఏమిటోయ్ వీడి గోల అనుకోకండి మొదటి సారి వందమార్కులు తెచ్చుకున్న స్కూలు పిల్లాడిలా, వంద రన్నులు చేసిన క్రికెట్ ఆటగాడిలా, వంద బంగారుపతకాలు సాధించిన వాడిలా, వందరోజులు ఆడిన సినిమా నిర్మాతలా, వంద రాంకు వచ్చిన ఎంసెట్ విద్యార్ధిలా, ఇలా వంద ఉపమానాలు రాయాలని వుంది కానీ మాటలు రాద్దామంటే మీటలు నొక్క బడట్లేదు.,,.