Latest Video :

గన్ పతి - 2



పరమ శివుడు ఇచ్చిన గన్ను..పార్వతీ దేవి ఇచ్చిన దన్ను కొండంత అండగా....తన వాహనమైన మూషికం మీద భూలోకం బయలుదేరాడు వినాయకుడు...



మూషికా ..ఇంకా భూలోక విషయాలు ఏమిటి?



ఏమి చెప్పమందువు స్వామీ...పూర్వం ప్రతి ఇంట కొలువై..బియ్యం పప్పులు,,ఏవి దొరికితే అవి తిని హాయిగా ఉండేవాళ్ళం..ఇప్పుడు పెరిగిన సాంకేతిక నైపుణ్యాల వల్ల.మా కొరకు బోనులని,,,పిల్లులుని, ఏకంగా రక రకాల విష పదార్ధాలని తయారు చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నారు..కొన్ని చోట్ల ఐతే మాకోసం తయారు చేసిన విష పదార్ధాలను..ఋణ బాధలు భరించలేని రైతన్నలు ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.. ఆ పాపం మాకు తగులుతుందేమోనని భయంతో ప్రాణ రూపం వదిలి..ప్రాణం లేని వస్తు రూపం పొంది..ప్రతి ఇంటా బయటా కంప్యూటర్ అనే యంత్రం మునే మీరుగా భావించి..మౌస్ రూపంలో బతుకీడుస్తున్నాము.....తండ్రీ....



మూషికా బాధ పడకు..అదంతా కలి ప్రభావము... అదిగో భూలోకం దగ్గరకొచ్చింది...అదిఓ భాగ్యనగరం..మాకు అత్యంత ప్రియమైన నగరం..



అవును స్వామీ ప్రస్తుతం భాగ్యనగరం చాలా 'ప్రియమైన ' నగరం..!



అదేమి మూషికా..నీ భావం ,మాకర్ధం కాలేదు..స్వామీ భాగ్యనగరం ప్రస్తుతం మహానగరం గా గుర్తింపు పొదింది..అందుకే అక్కడ ప్రతీ దానీ ధరలు పెరిగి ప్రస్తుతం ప్రియమైననగరంగా గుర్తింపు తెచ్చుకుంది..అంతర్జాతీయ విమానాశ్రయాలూ, ఇంకా వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రాక వల్ల భూమి విలువ పెరిగి బాగ ప్రియమైంది స్వామీ భాగ్యనగరం.



మరి బాగా సంపాదిస్తున్నారుగా ప్రజలు హాయిగా ఉన్నారా ? మా మీద భక్తి ప్రపత్తులు పెరిగాయా....
ఎక్కడ స్వామీ..వారికి అంత తీరికేదీ ? వూరు చివర ఉద్యోగాలు..దారి అంతా ట్రాఫిక్ జాములు, కాలుష్యం, రేషన్ కోసం పడిగాపులు, నీటికోసం ఎదురుచూపులు, పిల్లల చదువు కొనుగోలూ, ఇలా బాధలు అధికమై తీరిక ఏదీ మీ గురించి పట్టించుకోవడానికీ ?అదిగో స్వామీ భాగ్యనగరం వచ్చేసాం..జాగ్రత్త స్వామి?



ఇంతలో రవీంద్రభారతి కూడలి దగ్గర పోలీసు ఆపాడు స్వామిని..



ఎమయ్యా ! ఆగాగు.. ఏమిటి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నావ్..ఏమిటి అంత స్పీడు ? హెల్మెట్ట్ ఏది ?
హెల్మెట్టా ? అనగా నేమి..



శిరస్త్రాణం .స్వామీ (ఎలుక చెప్పింది)ఇదిగో ఉందిగా...కిరీటం చూపించి అమాయకంగా చెప్పడు స్వామి.



పోలీసు : అన్నట్టు సీట్ బెల్ట్ ఏది ?



గణపతి : అది ఎందులకు



పోలీసు.: నువ్వు వెళ్తుంది ఫోర్ వీలర్ మీద..అంటే ఇదిగో నాలుగు కాళ్ళున్నాయిగా అందుకు..అంటూ ఎలుక నాలుగు కాళ్ళు చూపించాడు



గణపతి: వీడి అసాధ్యం కూలా.ఇప్పుడేమి దారి మూషికామూషికుడు : స్వామి తమ జంధ్యం చూపండి నాగులే కాబట్టి నల్లగా ఉండి బెల్ట్ అనుకుంటాడు అన్నట్టు మీ బెల్ట్ కూడా నాగులే కదా దెబ్బకి వొదులుతుంది వాడి తిక్క..



గణపతి చూపించిన జంధ్యం చూసి పోలీసు మూర్చిల్లగా...."బతుకు దేవుడా" అనుకుంటూ బయట పడ్డారు..మూషిక, వినాయకులు...



లకడీ కపూల్ మీదుగా ఖైరతా బాదులోని తన భారీ విగ్రహం చూద్దమని వెళ్తున్న స్వామికి అక్కడి ట్రాఫిక్ జాం చూసి మూర్చ వచ్చినంత పనైంది...చిన్న సందు దొరికితే ఇరికించేసే ఆటోలూ, అదే పనిగా హారన్ కొడుతూ రొద చేశే కార్లు...విపరీతమైన జనంతో నిండు గర్భిణిలా తెగ పొగ వుదులుతూ..ముక్కుతూ మూలుగుతూ కదులుతున్న ఆర్టీచీ బస్సులు, ఆంబులెన్స్ కి కూడా సైడు ఇవ్వకుండా..ఆగిన ట్రాఫిక్ లో ఇరుక్కున్న స్వామికి రెండున్నర గంటల తరువాత కానీ ఖైరతాబాదు జేరలేక పోయాడు... హు మానవుడికి పాప్ పరిహారం కోసం మళ్ళీ నరకం అవసరం లేదనుకుంటా..ఆ యముడు పెట్టే బాధల కన్నా ఈ బాధలు తక్కువేమీ కాదు..మరణించిన తరువాత కంటే మరణానికి ముందే అన్ని శిక్షలు ఇక్కడే అనుభవిస్తున్నాడు పాపం మానవుడు..



స్వామి భావం పసిగట్టిన మూషికం ..మరీ అల ఫిక్స్ ఐపోకండి స్వామీ..ఇంకా చాలా చూడాలి తమరు ఈ పది రోజుల్లో..అంటుండంగానే రైలు గేటు పడింది...మరలా ఆగింది మూషికం..



రైలు కోసం ఆగిన కొన్ని చిన్న వాహనాలు..గేటు కింద నుంచీ దాటుకుని వెళ్తున్నారు..కనుచూపు మేరలోనే రైలున్నా ఒక్క నిమిషంలో నే అది వెళ్ళిపోతుందని తెలిసినా వాళ్ళు చేసే ఆ పని చూసి స్వామ్మికే భయం వేసింది.



ఇంతలో కాలిమీద ఏదో తడి..చూస్తే తన పారాణికన్నా ఎర్రగా మరో డిజైను...అది ఏమా అనుకుంటుండగా..సారీ బాస్ చూసుకోలేదు......అంటూ మరికొంచెం పక్కగా ఊసాడు తన నోట్లోని పాను పరాగ్ ని తన సరాగానికి మురిసిపోతూ... oka maanavuDu



హా! హతవిధీ !! అనుకుంటుండగా ముక్కులదిరే వాసన...అది ఏమి వాసనో స్వామి పొడవాటి ముక్కు కూ అర్ధం కాలేదు..అన్ని వైపులా ఆ వాసన తప్పీంచుకోవడానికి తన తొండాన్ని తిప్పే ప్రయత్నం చేశారు స్వామి....ఎటు తిప్పినా ఏదో ఒకీ వాసన తొండాన్ని తాకుతోంది..మొదటి సారిగా తొండం అంత పొడవుగా ఉన్నందుకు బాధ కలిగింది స్వామికి.....మూషికుడు ఇది పసిగట్టి ..స్వామీ అది ఆ పక్కనుంచి వస్తున్న మూత్ర శాల వాసన..ఈటుపక్కనుంచీ వస్తున్న చైనీసు నూడుల్స్ మసాలా ఘాటు..ఇటు ఆ కోడి మాంసపు దుకాణపు వాసన...అదిగో అక్కడ పొంగి పొర్లుతున్న డ్రైనేజీవనది నుంచి వచ్చే వసన..ఆ పక్కన ఉన్న కుళ్ళిన పళ్ళ వాసనతో కలిసి వస్తున్న కంపు స్వామీ మనం ఈ ప్రాంతం దాటినా ఆ వాసన మనల్ని వదలదు స్వామీ అన్నాడు...
ఆ వాసనలకి కళ్ళు బైర్లు కమ్మిన స్వామి ..మూషికా చీమూ- రక్తం కలిసిన వైతరిణి దాటడం అయినా సులభమేమో కానీ..ఈ భాగ్ య(మ)నగరం లో రహదారి దాటడం చాలా కష్టం,....ఏదో నవరాత్రులు పూజ చేసినారన్న ఆనందంలో కాలుష్య మయమైన టాంకు బండులో ముంచినా భరిస్తున్నా కానీ ఈ భాగ్యమ నగరంలో జీవించడం మనుష్యుల వల్లే కానీ ఇ దేవతల వల్ల కాదు..పద మన భారీ విగ్రహం దగ్గర జనాలని ఆసీర్వదించి మనమూ టాంకు బండు వద్ద వేచి వుందాం ఎలాగు నిమజ్జనం రోజున భక్తజనం వస్తారు కాబట్టి అక్కడనే ఆ ఆనందం పొందుదాం...అంటూ ముందుకు కదిలాడు స్వామి..
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger