ఏపి రియల్ ఫూల్...
మామూలుగా ఏప్రిల్ ఒకటో తారీకు నాడు ఫూల్ చేస్తారు కాని ఏంటో ఏపి అదే ఆంధ్ర ప్రదేశ్ రియల్ గా ఫూల్ అవుతోంది...రియల్ ఎస్టేట్ వల్ల ఐతే ఏంటి..ఇంకోదాని వల్లనైతే ఏంటి..మొత్తానికి తెలుగు ప్రజానీకం గొప్పగా ఫూల్ ఐపోతోంది..బడ్జెట్ చూపించి అబ్బో ఆంధ్ర గొప్పగా వెలిగిపోతోంది అంటుంది ప్రభుత్వం..అబ్బే తగలబడిపోతోంది అంటుంది ప్రతిపక్షం..
తెలంగాణ వస్తే మావల్లే అంటుంది.. తె ర స...అబ్బె మేమే తెస్తాం అంటుంది కాంగిరేసు.,..మేము సమైఖ్యాంధ్ర కే కట్టుబడ్డాం కాకపోతె ప్రజల అభీష్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం అంటుంది తె దె పా...అసలు మేమే తెలంగాణా కోసం పోరాడేది అంటుంది భ జ ప...కానీ ఎవెరౌ తీసుకొస్తారో తెలీదు....ప్రజలకి
ఇక చిరంజీవి పార్టీ పెట్టేస్తున్నాడు..రేపో యెల్లుండో .అంటూ ప్రచారం...ఆయన మాత్రం జల్సా గురించి....చరణ్ గురించి తప్ప ఎక్కడా ఏమీ చెప్పడు...పార్టీ పెట్టక పోయినా సమర్ధించినందుకు ఈ మధ్య ఒకాయనకి ఉన్న పార్టీలో లీడర్గిరి పోయి తన కోటలో కూర్చుని చిరు పార్టీ లో తన కోట గురించి ఆలోచిస్తున్నాడు....
ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఏపి రియల్ ఫూల్ అఔనా కాదా? మరిన్ని మరోసారి