Latest Video :

వారసత్వం పౌరసత్వం

వారసత్వం పౌరసత్వం
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఏ నాయకుడైనా అనుకుంటాడో లేదో డౌటే?
ప్రజలకు నాయకత్వం వహిస్తూ వాళ్ళ సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేసే వాడే అసలైన నాయకుడు,,
ఈ రోజుల్లో ఈ రాజకీయ నాయకత్వం వారసత్వం గా అందుతోంది మరి !
నెహ్రూ గారమ్మాయి "ఇందిర" ఇండియా indi(r)a కి భవిష్యత్తు నాయకురాలిగా ఎదిగింది...
తండ్రి వారసత్వాన్ని చేపట్టి దేశాన్ని ఏలింది...హాయిగా "గాలి' లో విహరించే స్వేచ్చా జీవి రాజీవ్ తల్లి మరణం తో సడెన్ గా రాజకీయాలలోకి లాండ్ అవ్వాల్సి వచ్చింది॥
దేశానికి ఏదో చెయ్యాలనుకున్న సంజయ్ పాపం కాలం కలిసి రాక తల్లికన్న ముందే వేరే లోకానికి వెళ్ళిపోయాడు॥
రాజీవ్ కూడా తీవ్రవాదుల చేటిలోఅ హతమైపోయాడు....
మళ్ళి కధ మామూలే నాయకత్వానికి పాపం ఎవరికీ సీనియారిటి చాలక సోనియా ని నాయకురాలిని చేసారు......
రావద్దొనుకున్నా రాహుల్ ని రాజకీయాలలోకి లాగేశారు॥ తండ్రి పోలికలతో పాటు పొలిటికల్ కరీర్ కూడా అంటగట్టేసారు....

ఆంధ్ర లో ఎన్ టీ ఆర్ కి వారసత్వం గా ఎవరు వస్తారో అని ఎదురుచూసిన రోజుల్లో సడెంగా తెరమీదకొచ్చిన లక్ష్మి పార్వతి ॥తరువాత కనుమరుగైపోయింది...
చక్రం తిప్పిన అల్లుడు చంద్రబాబు వారసుడయ్యడు...నాయకుడు అయ్యాడు ....అసలు పార్టీ స్థాపించిన పెద్దయనకన్నా 'పవర్' ఫుల్ అయ్యాడు...మరో అల్లుడు కొన్నాళ్ళు మంత్రిపదవితో సంత్రుప్తి పొందినా పెదవి ఇప్పే చాన్సులు రాక వైరిపక్షం చెయ్యి అందుకుని అందలం ఎక్కేసాడు॥ఆయన భార్య కూడా మంత్రి యోగం పొందారు....ప్రస్తుతం మళ్ళీ లక్ష్మీ పార్వతి అన్నగారి ఆశయాలను నిలబెట్టగల ఒక్క మగాడు వై ఎస్ అంటూ కితబిస్తున్నారు...అటు చంద్రబాబేమో నందమూరి వారసులు అధికపక్షం నా వైపే అంటూ రెండు వేళ్ళు చూపిస్తున్నారు॥ఒక పక్క వియ్యంకుడైన యువరత్నం తో పాటు రాజ్య సభలో సీటిచ్చి మరో బావమరిది చైతన్య రధ సారధి ని ఆకట్టుకున్నారు॥ఆయన వారసులు కూడా వెండితెర హీరోలు కాబట్టి వారి మద్దతు కూడా నాదే అని ధంకా పధం గా చెప్తున్నారు...ఇంతకీ ఎన్ టీ ఆర్ వారసులెవరు॥ భార్యా,। కూతురా, అల్లుడా, కొడుకులా, మనుమలా.....వై ఎస్సా ? రెండురూపాయలకు కిలో బియ్యం పధకం ఎన్ టీ ఆర్ నుంచి వారస్త్వం గా పుచ్చుకున్న వై ఎస్ కూడా...వారసుడేనేమో?

కె సి ఆర్, పి జె ఆర్, ల పిల్లలు కూడా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న సూచనలు ఆల్రెడీ రెడీ గా వున్నాయి...
ఇవన్ని వూహించేనేమో పాపం గాంధీ గారు......మనందరిని వారసులని చేసి జాతిపిత అయి పోయారు.....
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger