బీరు పొంగిన జీవగడ్డ అయి
బారు తెరచిన అభాగ్యసీమ అయి
వెలసినది ఈ ప్రభుత్వం
ఎత్తి తాగర తమ్ముడా..!
వేలశాఖలు వెలసెనిచ్చట
ఆది వారం క్యాబరె ముచ్చట
పేకాట ఫరమరుషులకు
సాహో అను చెల్లెలా...!
వివిధ రకముల మధ్యముల
విషము కొంచెం వొలికెనిచ్చట
తాళిబొట్టూ కరిగి పోగా
కొంప కాల్చే కొలిమి ఇచ్చట!
కూటి కోసం కూలికోసం
కొలువుకెళ్ళీ తీసుకొచ్చిన
సొమ్ముకాస్తా మురగబెట్టిన
నాటు సారా పాలు చేయర తమ్ముడా
దేశగౌరవము మంట కలవగ
దేశచరితము భ్రష్టమవగ
దీక్ష బూనిన ధీరపురుషుల
తెలిసి తాగర తమ్ముడా..!
లోకమెంతకు కేక పెట్టినా
ఆలి ఎంత గోల పెట్టిన
కుటుంబమంత వీధికెక్కిన
ఆస్తులమ్మి తెగ తాగర తమ్ముడా
మందు నదిలో మునిగిపోయే
మొగుడు జుట్టు పట్టీ గుంజకుంటే
కాపురం లో పేలి పోయే
'మందు ' పాతర చెల్లెలా..!
నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి