ఏ పీ ఎల్ 2
ఒక దశ ఐపోయింది.. ఇక రిజల్టు దశ మిగిలింది..ఏ పీ ఎల్ అంతే..నేను ఇంతకు మునుపు చెప్పినట్టు..
రాయల్ సీమ రాజీవ్స్ ఎంతో ఆత్మ విశ్వాసం తో ఉన్నారు..అన్నిప్లేసులూ మావే.. అన్నట్టుగా ఉన్నారు..ఎలాగూ 'సచివాలయం ' లో (ప్రజల ఖర్మ)కాలిపోయిన ఫైళ్ళు వెనక్కి రావు కాబట్టి జీవోలేవి ఇచ్చారో ఏవి ఇవ్వలేదో ఆ 'పై(సలుతిన్న) ' వాడికే తెలుసు.
టీ ఆర్ ఎస్ టార్టాయిస్ లు నడక మొదలెట్టాక కొంత సేపు టీ డీ పీ టైగర్స్ దగ్గర ఆగితే మనింటికే అనుకుని సీట్లిచ్చి మరీ ఆతిధ్యం ఇచ్చారు..తెలంగాణ తధ్యము సుమతీ అని శలవిచ్చారు..కానీ మళ్ళీ నడక మొదలెట్టి ఎన్ డీ ఏ దగ్గర ఆగింది..మళ్ళీ నడకమొదలెట్టి కాంగ్రెస్ దగ్గర కెళ్ళినా ఆశ్చర్యం లేదు..
ఇక చిరంజీవి చాలెంజర్స్ ..మాచ్ ఫిక్సింగు జరిగిందా ? జరిగితే దాని పర్యవసానాలేంటి..ఒక వేళ సెమీ ఫైనల్స్ దాకా చేరితే...ఏ 'టీం ' తో టై అప్ అవ్వాలో....లెక్కలు మొదలెట్టారు..
లోక్ సత్తా లయన్స్ ....రేల్లీ గ్రేట్ ఎందుకంటే జంగిల్ కా రాజా లయన్ ఒక్కళ్ళే ఉంటారు..ఆ 'లయన్ ' జే పీ ...
చూద్దాం పదహారు రోజుల పండగ నాడు ఎవరు గెలుస్తారో..ప్రజల అదృష్టం ఎలా ఉందో..