సినిమా(య) లోకం
చాలా సంతోషం అనిపించింది..నాకు వచ్చిన కామెంట్స్ చూసాక..బాలివుడ్ తోనో హాలివుడ్ తోనో పోలిస్తే కొంచెం నయమే అయినా..ఆ విషయానికి సంత్రుప్తి పడడం తప్ప మరొకటి కాదు..
అత్యధిక సినిమాలు నిర్మించే విషయంలో పడే పోటీ అర్థవంతమైన సినిమాలు నిర్మించడంలో ఉండదు..యేడాదికి 200 పైగా సినిమాలు నిర్మించే మన రాష్ట్రం నుంచీ ఇంతవరకూ జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డు సినిమాలు వచ్చాయి..?
సినిమా వ్యాపారం అనే వాళ్ళూ ఉన్నారు..నేనూ ఆ మాట ఒప్పుకుంటా..కానీ ప్రతీ వ్యాపారానికీ కొన్ని కట్టుబాట్లుంటాయి..ఉదాహరణకి ఫుడ్ కి సంబంధించిన వ్యాపారం అయితే ప్రజల ప్రాణానికి హాని కలిగించని విధంగా తయారుచేయాలి..ఎక్ష్పైరీ డేట్ లాటివి వేస్తారు...కల్లు లో డైజపాం కలిపి కల్తీ చేసినట్టు మనవాళ్ళు సినిమల్లో ఏవో కలిపి కల్తీ చేసి ఆ మత్తుకి యువతని అలవాటు చేస్తున్నారు...తమ వ్యాపారానికి వేరే వాళ్ళని బలి చెయ్యడం ఎంతవరకు సమంజసం...
ఎంతసేపూ పెద్ద హీరోల ఇమేజ్ తగ్గ కూడదు అంటూ అర్ధం లేకుండా విలన్లని స్రుష్టించి..వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి హీరోలు కత్తి పట్టి చంపడాలు,,,పిల్లల పెళ్ళిళ్ళు చేసిన హీరోలకు పదహారేళ్ల పడుచు హీరోయిన్లు.....ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా సంభాషణలు...పిచ్చి పుట్టేలా వెకిలి గంతులు...చివర్లో శ్రీరంగ నీతులు..,,,తప్ప మరో విధం గా అలోచించలేరు...అటు అభిమానులు..ఇటు దర్శక నిర్మాతలు..
మళయాలం నుంచీ తమిళం నుంచీ కధలు...కధానాయకలని అరువుతెచ్చుకుంటున్నప్పుడు..మరి అక్కడి హీరోల లా వయసుకు తగ్గ పాత్రలు..ప్రయోగాత్మక సినిమాలు ఎందుకు చెయ్యరో అర్ధం కాదు...ప్రయోగం అనగానే చీకట్లో ...అడవుల్లో,,భయపెట్టే విధంగా తప్ప ఆలోచించలేరు...
సినిమా అనేది ఒక బలమైన వినోద సాధనం..ప్రజలని ముఖ్యంగా యువతని ప్రభావితం చేసే ఈ మాధ్యమానికి చెందిన వారికి..దాని వల్ల సంపాదిస్తున్న వారికి సమాజం పట్ల బాధ్యత కూడా వుండాలి..రేపటి జెనరేషన్లో వాళ్ళ పిల్లలు కూడా వున్నారని గుర్తించాలి..అప్పుడైనా కొంచెం మంచి సినిమాలొస్తాయని ఆశ.....