వన్ వే
సినిమాల నుంచి పాలిటిక్స్ అంటే హై వే లో ప్రయాణం కాదు....'రాజకీయం' - వన్ వే లాంటిది..ముందుకే తప్ప వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు . అది సైకిలైనా, కారైనా, రైలైనా , ఒకటే రూలు ...
ఎన్నికల సందర్భంగా 'చిరు' గాలులు వీస్తున్న ఈ రోజుల్లో=== అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది.. ముందు వెళుతున్న వాళ్ళని ఓవర్ టేక్ చేసుకుంటూ వెళ్ళాలి...మధ్యలో అలకల స్పీడ్ బ్రేకర్లు...ఫిరాయింపుల పంచర్లు రకరకాల అడ్డంకులు...వస్తుంటాయి...వాళ్ళు వెళ్ళడానికి మనల్ని తోసెయ్యడానికి కూడా వెనకాడని రాష్ డ్రైవర్లు కూడా ఉంటారు..ఈ రోడ్డులో ...రాజకీయ రాక్షస డ్రైవర్లు అనొచ్చేమో....
రిజిస్ట్రషన్ కొంచెం ఈజీనే ఎందుకంటే మనకిష్టమైనది కొంచెం కాస్ట్లీ ఐనా కూడా దొరుకుతుంది...పూజ చేయించి రోడ్డు మీదకి రావాలంటే మాత్రం కొన్ని కంపల్సరి...
ఇక్కడ లైసెన్సు (lie-sense)అంటే అబద్దం చెప్పగల సెన్సు వుండాలి అదీ ప్రజలతో...సాధారణంగా ఎన్నికలప్పుడు,,,అసాధారణంగా వచ్చే బై ఎలక్షన్లప్పుడు....అసెంబ్లీలోనూ...ఎక్కడైనా..ఎప్పుడైనా,,,అలవోకగా లై అంటే అబద్ధం చెప్పగలిగే సెన్సు ఉండాలి....అప్పుడు హాయిగా ఏబండైనా నడపొచ్చు..అంటే ఏ పార్టీలోనైనా...రాష్ట్రంలో నైనా ...కేంద్రంలోనైనా ఓ కే
కులాలు, మతాలు, గ్రూపులు..లాంటి కాలుష్యం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ అన్నీ సరైన పాళ్ళలో వున్నాయా లేదా చూసుకుంటుండాలి
పార్టీ రధం కదలాలంటే దానికి పెట్రోలు చాలా అవసరం...అది కొత్త బండి ఐతే ఎక్కువ తాగుతుంది....బండి పాతదైన కొద్దీ మైలేజిలో ..పికప్పులో కొంచెం తేడా వస్తుంది.....
లంచాలడిగే కానిస్టేబుళ్ళలా కాంట్రాక్టులడిగే జనాలు...ఆఫీసర్లు....చాలామందినే ఖుష్ చెయ్యాలి...పిడివాదాలు, విడి వాదాలు లాంటి టోల్ గేట్లు..దాటాలి...
మనమొక్కళ్ళమే కాదు
మన వెంట వచ్చే బళ్ళు కూడా మనతో సమానంగా రాగలిగితేనే ఈ రిలే రేసులాంటి సవాలు గెలవగలిగేది...