ఈమధ్య పేపర్లో ఒక వార్త చదివా...
అధికారులు కారులోకాక విమానాల్లో తిరుగుతున్నారనీ.,..అదీ జిల్లాలకు కాక జాలీ గా విదేసాలకనీను...ఐతే ఇక్కడ మనం చూడవలసింది ఇంకొకటి ఉంది..పాపం వాళ్ళు అలా తిరిగి తిరిగి వచ్చి మనదేసాన్ని కూడా విదేశాల్లా చేసేద్దమనే తప్ప వేరే ఉద్దేస్యాలేమీ ఉండవు అని వాళ్ళు అంటూ వుంటారు..దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి కాబట్టి..డబ్బు రూపేణ తీసుకుంటే లంచం అని పేరు పెడతారు కాబట్టి..ట్రిప్పు రూపేణా తిరిగి లెక్కల్లో కలిపేసే కొత్త ఆలోచన... ఎంతైనా మేధావులు కదా...ఆమాత్రం కొత్తగా పనికొచ్చే విధంగా ఆలోచించకకపోతే ఎలాగ...అంతేకాదు..స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి..సదరు శాఖకు చెందిన మంత్రిగారో వారి చుట్టమో ఉంటే టూరు మరింత రంజుగా ఉంటుంది..ఎలాగూ ప్రవాసాంధ్రులు ఆతిధ్యానికి సిద్ధం గా ఉంటారు కాబట్టి...అఫీషియల్గా తిరగొచ్చు,,,చాంట్రాక్టర్లందించేవి తీరిగ్గా తినొచ్చు...అందుకే మట్టి కొట్టుకుపోతున్న రోడ్లలా వెక్కిరిస్తుంటే ఆదారిన రాక విదేసీ దారులు పడుతునారు అధికారులు....దీనికి సర్వేయ్ అని ఒక లింకు....ఎవడి చెవిలో పువ్వులు పెడతారో...నెలకి జీతం తీసుకుంటున్నందుకు కనీసం ఆ ఒకటో తారీకైనా గుర్తుకు వచ్చి నెలకు ఒక్క సారైనా ఏదైనా చిన్న గ్రామం వెళితే తెలుస్తుంది..చైనా వెళితే ఏమి తెలుస్తుంది...వెనకటికి జపాను వాడు 2 సంవత్సరాలలో బీహారుని జపానుగా మారుస్తామంటే...2నెలల్లో జపానుని బీహారుగా మారుస్తానని లాలూ అన్నాడట..ఎన్ని టూర్లు తిరిగినా పల్లెటూర్లు బాగుపడతాయా మహాశేయా...