ఓడిలైడ్
క్రికెట్ లో ఆడడం ఓడడం గెలవడం సహజం. కానీ మనవాళ్ళు ఓడితే మనంసహించలేం,ఎవరైనా అంతే,,కాకపోతే ఆస్ట్రేలియా లేదా పాకిస్తాన్ చేతిలో ఓడినా కెన్యా చేతిలో ఓడినంత హంగామా చేస్తాం, వాళ్ళ ఫిట్నెస్ కీ మన ఫిట్నెస్ కీ చాలా తేడా ఉంది..మధ్యలో సెలెక్షన్ కమిటీ వాళ్ళ సరదాకొద్దీ జట్టులోకొచ్చే వాళ్ళు పోయేవాళ్ళూ..అప్పుడెప్పుడో అమర్నాధ్ అన్నట్టు జోకర్లు అనుకోవాలేమో,,కోచ్ ఉన్నాడో లేడో తెలీదు...ఎవరు ఓపెనింగో ఎవెరి కరీరు క్లోసింగో చెప్పలేము..ఫాం లో ఉన్న గంగూలీ ఇంటికి,,,గాయమైనా యువరాజు డ్రెస్సింగురూముకి,,బాగా ఆడిన మురళీ ఎక్కడో తెలీదు,,,మునాఫ్ ఎందుకో చెప్పలేము..ఎవరు టీంలో ఆడతారో తెలీనప్పుడు ఓడతారో గెలుస్తారో ఎలా చెప్పడం..కాకపోతే దారుణంగా ఆడి ఘోరంగా ఓడిపోవడం జీర్ణించుకోలేము..20-20 అంటే ఇద్దరు కలిసి 20 ఓవర్లు ఆడాలనుకున్నారో ఏమొ..ఆడి చాలాకాలం అయింది కదా..ఐనా ఆసీస్ కంటే మనమే ఎక్కువ ఎందుకంటే వాళ్ళు 1 మనం 10 --వికెట్లు..వాళ్ళు 11 మనం 18---74 పరుగులు చేయడానికి తీసుకున్న వోవర్లు..మనం ప్రపంచ చాంపియన్లం వాళ్ళు వరల్డ్ నంబర్ వన్.. యేంటో 4 గంటల్లో ముగిసిపోయే ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలీదు కానీ అభిమానులు మాత్రం బలవుతున్నారు..అభిమానులంటే గుర్తొచ్చింది.. ఈమధ్య మన మెగా అభిమానులు చేసిన లొల్లి తర్వాత సినిమా లెవెల్లో నకిలీలని పోలీసులు అదుపులోకి తీసుకున్నరట..అసలే తెలుగు భాషలో తనకి నచ్చని పదాన్ని అభిమానుల వల్ల రాజసేఖర్ జీవితలకి చెప్పిన మన మెగాస్టార్కి ప్రస్తుతం స్టార్లు బాగాలేనట్టున్నాయి ప్రతీ రోజూ ఏదో ఒక తలనొప్పి తయారవుతోంది..చిరుత పెళ్ళి చేసుకున్నాడని..మరో పుకారు లేచింది ...ఐతే ఓ కారు చూడ్డానికి షికారు కొచ్చిన చిరుత అదంతా పుకారేనని పెల్లిచేసుకుంటే చెప్పే చేసుకుంటానని హుషారుగా చెప్పి..తెర దించాడు ఆ కథకి ..పాపం సెలెబ్రిటీలకి ఇలాంటివి తప్పవేమో...