నా తెలంగాణ కోటి రతనాల వీణ
తె రా స అంటే ఇన్నాళ్ళూ తెలంగాణా రాష్ట్ర సమితి అనుకున్నా …కానీ తె రా స అంటే
“తె “ల్లారి “రా”జీనామ “స “మర్పణ -----సాయంత్రం ఉపసం హరణ అని నేడే తెలుసుకున్నా..
కాసేపు ఆయనే నాయకుడు అంటారు..ఆయనకి పూజలు చేస్తారు, స్త్రోత్రాలు చదువుతారు..ఆయనా యాగాలు చేస్తారు..తీరా కాసేపటికే..పచ్చి మోసగాడు..బంధుపక్షపాతి..ఇంకా నానా మాటలు అంటారు..వెంటనే ‘రాజీ నామా చేసేస్తారు…వెంటనే బతిమిలాడతారు..ఆయనా ఒప్పుకుంటాడు..ఇదీ మామూలే అయిపోయింది…
ప్రజలు మాతో ఉన్నారు అంటే మాతో ఉన్నారు అని అంటారు అందరు..ప్రజలు వాళ్ళతో ఉండి పక్క వాళ్ళకి ఎందుకు వేస్తారో మరి ఓట్లు…
విజయం మాదే అన్నారు..తెలంగాణా తధ్యం అన్నారు..తీరా చూస్తే కధ అడ్డం తిరిగింది,
మనం పోరాడాల్సింది..మన హక్కుల కోసమా..బడ్జెట్ కోసమా..ప్రాజెక్టుల కోసమా ప్రతేక రాష్ట్రం కోసమా అన్నది నాకు తెలియట్లేదు.
తెల్ల దొరల పాలన నుంచీ విముక్తి కోసం..స్వరాజ్యం కోసం పోరాడాం ..సాధించాం
నిజాం నిరంకుశ పాలన నుంచీ విముక్తి సాధించాం.
భాషా ప్రాతిపదిక పై తమిళనాడు నించీ విడిపడ్డాం …ఆంధ్రులమయినాం.
ప్రాజెక్టులో..బడ్జెట్టులో..మరో అవసరమైన ఏ విధమైన హక్కైనా పొరాడి సాధించే ప్రజలు తగ్గుతారు….ఆంధ్రులమై ఒక్క తాటిపై నిలిచి పన్నెండు కోట్ల మందీ ఆ ప్రాంత అభివృద్ధి కోరితే..నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తే..నిధులు సరిగా పంచి..విధులు సక్రమంగా చేస్తే…నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరధి పలుకులు అక్షర సత్యమౌతాయి..తెలంగాణ నేల..సశ్య శ్యామలమౌతుంది..
(రాజకీయంగా సరైన అవగాహన లేకపోయినా…ప్రతి రోజూ జరుగుతున్న రాజకీయ్ పరిణామాలు చూసి ఇలా స్పందించా..ఎవరినీ నొప్పించడానికి కాదు..మనమంతా ఒకటే అని ఒప్పించడానికి. మాత్రమే...పూర్వం మనం సాధించిన విజయాలు ఒక పార్టీ వారో..ఒక్క నాయకుడో..ఒక్క సంస్థో సాధించినవి కావు…అవి ప్రజా యుద్ధం తో సాధ్యమైనవి..పార్టీల కి అతీతంగా …లక్ష్య సాధన కోసం పోరాడితే తప్పక విజయం సాధిస్తారు..జయహో…..తెలుగోడా,,,,,,,,,,,,,,,)
తెలంగాణా అభివృద్ధికి నేను సైతం అంటూ మీతోనే మేమూ అంటూ ప్రతి ఒక్కరు ప్రాంతీయ, రాజకీయ, బేధం లేకుండా పోరాడాలని కోరుకునే…ఒక అనామకుడు.నచ్చితే నలుగురికి చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి