మరేమనాలో తెలియలేదు...ఇందిరా పల్లెబాట..రాజీవ్ నగర బాట ....మరి సోనియా గాలి బాట.....పాపం రాజీవ్ బతికున్నన్నాళ్ళూ బొట్టు పెట్టిందో లేదో నాకు తెలీదు కానీ .....ఈమధ్య బొట్టెట్టుకోవడం మాత్రం ఎక్కువైంది...సరే అది ప్రజల మనోభీష్టం కాబట్టి మనమేమీ అనకూడదు....
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో నాయకులే లేనట్టు... అసలు ఈ విమానాశ్రయం విషయంలో అంతా సోనియా దయే అన్నట్టు...అసలు రాజీవ్ పూర్వాశ్రమంలో పైలట్ అవడం వల్లే హైద్రాబాద్ కి విమానాశ్రయం వచ్చినట్టు....ఆ దండోరా యేమిటో.......కనీసం ప్రతిపక్షనాయకుడైనందుకైనా చంద్రబాబుకి మర్యాద ఇవ్వకుండా తూ తూ మంత్రంగా జరిపిన సభ సోనియా పూజ తో రాజీవ్ నామస్మరణతో అక్కడ కూడా రుణాల మాఫీలూ.....ఇందిరమ్మ పధకాలు గూర్చి చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం మొదలెట్టిన నాయకులకే తెలియాలి.....
అన్న ఎన్ టీ ఆర్....పేరు పెట్టడానికి పాపం వాళ్ళకి...చేతులు రాలేదు....పి వి పేరు కనీసం రోడ్డుకైనా పెట్టారు..సంతోషం.....దానికి కూడా రాజీవ్ పేరు పెట్టుంటే అది కూడా ఈపాటికి తయారయ్యేదేమో....
పదేళ్ళ పిల్ల సోనియా (రాజకీయాల్లో ఆమె వయసు) చేతుల మీదుగా సుమ్షాన్ బాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవం లో ఏకైక ఆనందం దియా మిర్జా చీరకట్టులో రావడం.......
మొత్తానికి ఆంధ్ర ప్రదేష్ నాయకులను గాలికి వదిలేసి .........అనుకున్నది కానిచ్చేసారు....