శివ శివా
శివ రాత్రి తో చలి శివ శివా అంటూ పోతుంది అంటారు పెద్దలు,, కాని ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల వేడి వల్ల ఆ చలి ఎప్పుడో పోయింది అనిపిస్తోంది....
కె చి ఆర్ రాజీనామాలు,,,, మధు యాష్కీ పై గోనె విసిరిన నకిలీలల వల.....జల్సా ఆడియో కార్యక్రమంలో చిరు సందేసంతో తలెత్తిన సందేహాలూ నా తర్వాతి సినిమా వస్తుందా రాదా తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతం యువతరం వెనుక నడుస్తా,అంటూ సందేహాత్మక సందేశాత్మకంగా మాట్లాడిన తీరూ, చిదంబర రహస్యం అను పేరుగల ఎన్నికలల బద్జెట్టూ,, ఆంధ్రా ని పట్టించుకోకుండా తమిళనాడు కి వరాలిచ్చిన లాలూ రైలూ అబ్బో ఈమాసం లో అన్నీ విసేషాలే.....
చాలా చోట్ల చూశా... శివాలయాల దగ్గర పూజ టికెట్ల కన్నా రైతు బజార్లు, పండ్ల మార్కెట్టుల దగ్గర పుచ్చకాయల, అరటిబండ్ల దగ్గరే ఎక్కువ లైనులున్నాయి...దేవుడికన్నా రూపాయి తక్కువకి అమ్మే షాపాయినే గొప్పగా కనిపిస్తున్నాడు..అసలే శలవలు కూడా ఇవ్వని ఆఫీసుల గొడవ, ట్రాఫిక్కు చిక్కుముడి,,,పరీక్షల సీజను,,,ఆహా అన్నీ కలసి వస్తే మధ్య తరగతి మానవుడి ని ఆ దేవుడే కాపాడాలి...
దీనికి తోడు.. అసలు శివరాత్రి 5 తారీకున చేసుకోవాలి అర్ధరాత్రి చతుర్దశి వుంది అని ఒక మఠం వారంటే ఠాట్ వీల్లేదు 6 నే చేసుకోవాలి అదంతే అని మరో దేవస్తానం వారు హుకుం జారీ చెస్తారు...ఏరోజు జాగారం చేయాలో తెలీక ఇక ఏరోజైతే మన తెలుగు చానెళ్ళలో సినిమాలు వేస్తారో ఆరోజే శివరాత్రి అని ఆ పళ్ళు తింటూ ఆ సినిమాలు జల్సా కార్యక్రమాలూ చూసుకుంటూ శివ శివా అనుకుందాం.....
`