ఇది నా యాభయ్యవ పోస్టు...ఆనందంగా ఉంది...ఇంత చక్కని వేదిక తయారు చేసినవారందరికీ వందనం.....
డాన్ స్ స్ స్ స్
డాన్స్ చేయాల్సిన వాళ్ళు డాన్ చేస్తే ఇలానే ఉంటుంది అనిపించింది.. ఈ మధ్య వచ్చిన ఆ సినిమా చూస్తే... టైటిల్ తీసుకున్న వాళ్ళు కథ కూడా తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదోమో అనిపించింది... మాస్ ఆడింది కనక ఇది కూడా ఆడుతుంది..తను ఆడింది ఆట పాడింది పాట అని ఆ దర్శకుడి ఉద్దేశ్యం కాబోలు..అందుకే మ్యూజిక్కు కూడా చేసిపారేసాడు మన మొహాన...నడవాల్సిన చోట డాన్సు చేసినట్టు కథ కూడా నడవాల్సిన చోట డాన్సు చేసిందిల్...ముల్టీ స్టార్ చిత్రాలు రాని కొరత తీరుద్దామని అనిపించి అలా చేయాల్సొచ్చిందని పాపం ఆ హీరో గారన్నా ఇది పల్టీ స్టారర్ చిత్రం అనొచ్చేమో...
ఇక ఒక్క మగాడు గురించి తలుచుకుంటే....భారతీ(సర్దార్ పాపారా)యుడు గుర్తుకొచ్చారు.....స్వాతంత్ర్య సంగ్రామం లో పోరాడిన పెద్ద మగాడికి ఆ సిమ్రాను కాక యే భానుప్రియ లాంటి కాస్త నటన తెలిసిన వాళ్ళని పెట్టుంటే బాగుండేదోమో...ఇక ప్రేక్షకులకి కనువిందు "యోగం" కలిగించడానికి అనుష్క యెలానూ ఉంది... ప్రదర్షనకు ప్రియంక ......ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి తిరిగేది లేదు.....
వెలిసింది వాన...ధియేటర్లోనా అని పాడుకోవాలేమో..ప్రస్తుతం మ(బ)కర సంక్రాంతి రాజు.....మంగార మలై ని తెలుగులోకి కనడం వల్ల కంగారు మలై అయి కంగాళి అయినట్టుంది..వేలెడతారనేమో ఆస్థాన విద్వాన్సుల్ని కాదని కొత్త కాంబినేషన్లో చేసిన సినిమా ప్రస్తుతం వానా కాలం కాకపోవడం వల్లో ? కాలం కలిసి రాకో కొంచెం వెలిసీనట్టూ గానే వుంది ..
పండగ నాడు విడుదలయ్యే సినిమాలకోసం యెదురుచూసే సగటు అభిమాని ప్రస్తుతం తీగకు తగులుకున్న పతంగి లాంటి వీటిలో యేవి చూడాలో తెలియక ....టీవీ ని నమ్ముకున్నట్టున్నాడు...