Latest Video :

ఒకటికి మూడు ఫ్రీ

పండగ సీజన్ వచ్చింది కదా...మూడు కొంటే ఒకటి ఫ్రీ రోజులు పోయి ఒకటి కొంటే మూడు ఫ్రీ రోజులొచ్చాయి...తెలుగు సినిమాలు కూడా అంతే..ఒకటి కి మూడు ఫ్రీ కాన్సెప్ట్ తో వస్తున్నాయి..కావాలంటే ఈ ధారావాహిక ఫాలో అవండి..

ఫాక్షన్ సినిమాలు..




గ్రా మ సిం హం



హీరో కాశీ లోనో, కేరళ లోనో, కన్యాకుమారి లోనో అంట్లు తోముతూనో, కార్లు కడుగుతూనో, ఉంటాడు..బాగా కడుగుతున్నాడని, యెదురుగా ఉన్న ఒక హీరోయిన్ ప్రేమిస్తుంది...అడుక్కుతింటున్నా హీరో కాబట్టి అమెరికాలో పాటలు పాడుకుని...పెళ్ళి మంటపం దాకా వస్తారు....అప్పుడు 40 టాటా సూమోలు వచ్చి ఆగుతాయి మంటపం ముందు.. అందులోంచి 80 జతల మగ కాళ్ళూ, ఒక జత ఆడ కాళ్ళూ దిగుతాయి.. ఆ పెళ్ళీ ఆపి అతను హోటల్ లో క్లీనర్ కాదని, కడపలో లీడర్ అని చెప్పి అందరినీ కడప రైలు యెక్కిస్తారు..అక్కడ ఈలోపల ఈ పాప తో ఫ్లాష్ బాక్ లో పాటలు, ప్రేమలు.. అయిపోయి.....క్లైమాక్స్ లో కొత్త రకం ఆయుధం పట్టి విలన్లు అందరి పని పట్టి ....చంపడం పాపం నరకడం ఘోరం అన్న సూక్తి తో సినిమా సమాప్తమౌతుంది.....
ఇందులో హీరో గారికి విలన్ ని చంపడానికి కత్తులక్కర్లేదు..కంటి చూపు చాలు....గొడ్డళ్ళక్కర్లేదు--గోళ్ళు చాలు...ఉరి తాడు అక్కర్లేదు....మొలతాడు చాలు.....

మనకి ఆయన చంపక్కర్లేదు--సినిమా చూస్తే మనమే పోతాం....
(మీకు 3 సినిమాలు గుర్తుకు వస్తే బాధ్యత నాది కాదు....చిన్ని క్రిష్నుడిది )

ఇది ఒకటికి మూడు ఫ్రీ లో ప్రధమ భాగం...ఇంకా అనేకం ఉన్నాయి...

ప్రస్తుతానికి

ధన త్రయోదశి..నరక చతుర్దశి.....దీపావళి శుభాకాంక్షలు.....మీ ఫణి మాధవ్...,..
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger