Latest Video :

సెన్సారు చేసేవాళ్ళకు సంసారాలు పట్టవా

 సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు...
అబ్బ ఎంత గొప్ప టైటిలో..పోస్టర్ చూస్తేనే అసహ్యం వేసింది..అసలు అలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఆ మహానుభావులకి.

సెన్సారు చేసేవాళ్ళకు సంసారాలు పట్టవా అని నా డౌటు. సెన్సారంటే ఏంటో ఎందుకుందో కూడా నాకర్ధం కావట్లేదు. టైటిలూ గురించి వాళ్ల పరిధిలోకి రాదా...లేక సినిమా చూసేసి ఏదో ఒక సర్టిఫికేటు ఇవ్వడమేనా వాళ్ల పని అని నాడౌటు.

అందులోనూ ఈమధ్య..ఓ సినిమాలో రింగ రింగా అంటూ వచ్చిన పాటని తరువాత ఎవరో అభ్యంతర పెట్టినందుకు గాను మార్చారు..అలానే అదుర్స్ లోనూ ఒక మాట మార్చారు. మరి సెన్సారు సమయంలోనే ఇవి ఎందుకు జరగడన్లేదో మరి?

స్త్రీలని, అంగవైకల్యాన్ని, సాంప్రదాయాల్ని, కులగౌరవాన్ని, మత విశ్వాసాల్ని, భాష, ప్రాంత గౌరవాల్ని, చరిత్రని కించపరిచే విధం గా ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమించకూడదు అన్న ప్రాధమిక సూత్రం వీళ్ళకి వర్తించదేమో అని నాకు మరో డౌటు. ప్రజల ముందుకెళ్ళబోయే ముందే మనం చూస్తున్నాం, రేపు మన పిల్లలో ..ఆ వయసు వాళ్ళో చూస్తారు అన్న కనీస బాధ్యత వీళ్ళకు గుర్తురాదెందుకో.?

A సర్టిఫికెట్ అంటూ ఇస్తే దాని అర్ధం ఏమిటి..పాటించవలసిన నియమాలేంటి..పోస్టర్ మీద కనిపించే విధం గా ఉండాలి, 18 ఏళ్ళ లోపు వాళ్ళకి చూసే హక్కు లేదు....ఇలాంటి విషయాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా?


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share this article :
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Daggara Darshini - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger